Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
మహిళా అంధుల క్రికెట్ జట్టుకు అండగా ఉంటామని బాగ్ అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం అంబర్‌పేట వాటర్ ఫాల్స్ గ్రౌండ్లో జరిగిన మహిళా అంధుల క్రికెట్ పోటీలో గెలుపొందిన జట్టుకు జనహిత స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు, సెన్సార్ బోర్డు సభ్యురాలు ఉమా మహేశ్వరిరెడ్డి, డాక్టర్ చిక్కా హరీష్‌కుమార్ లతో కలిసి ట్రోఫిని బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంధుల మహిళా క్రికెట్ ఆటగాళ్ల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి కావాల్సిన సహాయ సహాకారాలు అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ అధ్యక్షులు జి.శ్రీధర్, కార్యదర్శి అనిల్‌కుమార్, బోర్డు సభ్యులు మాధవులు, మధు తదితరులు పాల్గొన్నారు.