Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
కార్ల్ మార్క్స్, పూలే అంబేద్కర్ మార్గంలో ఉద్యమించడమే కాకుండా ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన నక్సలైట్ల శాంతి చర్చలో జనశక్తి పార్టీ ప్రతినిధిగా పాల్గొని బహుజన శ్రామిక విముక్తి కోసం తన జీవిత కాలం పోరాటం చేసిన మహనీయుడు కామ్రేడ్ కళ్లెపు చంద్రన్న అని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మెన్ ప్రొ. గాలి. వినోద్ కుమార్ అన్నారు. ఆదివారం ఓయూలోని తన కార్యాలయంలో చంద్రన్న రెండో వర్ధంతి పోస్టర్ను ఆవిష్కరించారు. నిజాయితీగా తాను నమ్మిన సిద్ధాంతం, తన ప్రజల విముక్తి కోసం తను చనిపోయే వరకు పోరాటం చేసిన నిత్య పోరాట యోధులు అసంఘటిత కార్మికుల ఉద్యమకారుడు కామ్రేడ్ చంద్రన్న అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం అందరూ కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో మాదిగ దండోరా నాయకులు రామన్న, కేసీఎస్ ప్రసాద్, కళాకారులు డోలక్ యాదగిరి, యాదగిరి, వరంగల్ ఎల్ఆర్లు ఎనుముల శ్యామ్ కుమార్, యాదయ్య కలగొట్ల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.