Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం కార్మికుల సమస్యల పరిష్కారానికి పనిచేసిన వ్యక్తి కామ్రేడ్ అశోక్ అని అన్నారు. శనివారం రాత్రి మీర్పేట్ చౌరస్తాలో కామ్రేడ్ గంగేరి అశోక్ సంతాప సభ జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య ప్రజల కోసం, అసంఘటిత కార్మికుల హక్కుల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు. నమ్మిన సిద్ధాంతం కోసం అహర్నిశలు శ్రమించి జీవితాన్ని సైతం కార్మికుల హక్కుల కోసం నిబద్ధతతో పనిచేసిన నాయకుడు అశోక్ అని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి చనిపోవడం సీఐటీయూటీ, పార్టీ, ప్రజా ఉద్యమానికి తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇందిర, రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆశయ్య, సీఐటీయూ జిల్లా నాయకులు శేఖర్, సీపీఐ(ఎం) నాయకులు దాసరి బాబు, టి కిషోర్, రాజేశ్వర్ రావు, అశోక్ కొడుకు, కూతురు, వివిధ కార్మిక సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.