Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
'ప్రజలకు సేవ చేసే అవకాశం చాలా కొంతమందికే వస్తుంది. అలా ప్రజలిచ్చిన ఈ అవకాశాన్ని ప్రజలకు సేవ చేయడానికే ఉపయోగిస్తాను' అని పీర్జాదిగూడ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పుట్టిన రోజు వేడుకలను పీర్జాదిగూడ కార్పొరేషన్ టీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ శ్రేణులు, జక్క వెంకట్ రెడ్డి అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తనపై అభిమానం చూపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. తాను రాజకీయాల్లోకి ప్రవేశించిన వెంటనే సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, చామకూర మల్లారెడ్డి సహకారం, పీర్జాదిగూడ కార్పొరేషన్ ప్రజల ఆశీర్వాదంతో మేయర్ పదవీ బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. అలా ప్రజలిచ్చిన అవకాశాన్ని ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నాను అని అన్నారు. భవిష్యత్‌లో పీర్జాదిగూడను రోల్ మోడల్ కార్పొరేషన్‌గా తీర్చడానికి తన వంతు కృషి చేస్తానని హమీ ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేటర్లు సుభాష్ నాయక్, హరిశంకర్ రెడ్డి, పిట్టల మల్లేష్, టీఆర్ఎస్ నాయకులు పప్పుల అంజిరెడ్డి, మాడ్గుల చంద్రారెడ్డి, బైటింటి ఈశ్వర్ రెడ్డి, బండి సతీష్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు షేక్ ఇర్ఫాన్, జవీద్ పాల్గొన్నారు.
కమలా హాస్పిటల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
మేయర్ జక్క వెంకట్ రెడ్డి పుట్టిన రోజు సందర్భాన్ని పురస్కరించుకొని నగరంలోని కమలా హాస్పిటల్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరంలో పలువురు నాయకులు, యువజన విభాగం నేతలు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. కో ఆప్షన్ సభ్యులు షేక్ ఇర్ఫాన్, మైనార్టీ సెల్ నాయకులు జవీద్, హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ ఖాజా రక్తదాన శిబిరాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు