Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
పిల్లలకు చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యం అని రాచకొండ పీడీ యాక్ట్ ఏసీపీ విజరు శ్రీనివాస్ అన్నారు. ఆదివారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల శాంతి వనం పార్క్లో 'పాషా స్పోర్ట్స్ అకాడమీ' ఆధ్వర్యంలో ఆటల ప్రాముఖ్యత అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటస్థలం అనేది గెలుపు, ఓటమిల సమాహారం. గెలిస్తే ఒకలా, ఓడితే ఒకలా ఉండటం జరగదు. అలా పిల్లలు ఉండడం వల్ల వారిలో మానసిక శక్తి మెరుగుపడుతుందని అన్నారు. ప్రస్తుత కాలంలో అనేక విద్యా సంస్థల్లో పిల్లల ఆటలకు అనువైన ఆట స్థలం లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇలా ఉండడం వల్ల విద్యార్థులు చదువు తప్ప వేరే ధ్యాస లేకుండా పెరుగుతున్నారన్నారు. దీని వల్ల పిల్లల్లో మానసిక ఆందోళన మొదలై ఆత్మహత్య లు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది అని అన్నారు. పిల్లలు చదువుతో పాటు అన్ని రంగాల్లో చురుగ్గా ఉంటారు అని సూచించారు. కార్యక్రమంలో పాషా, సంతోష్, పాషా అకాడమీ సభ్యులు, చుట్టు ప్రక్కల ప్రాంతాల వాకర్స్ పాల్గొన్నారు.