Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరంలాంటిదని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. ఆదివారం గోల్నాకలోని తన క్యాంప్ కార్యాలయంలో లబ్దిదారులకు సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధిని అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో లబ్దిదారులు యాకమ్మ, ఆర్.వినరుగౌడ్, విష్ణువర్ధన్, సర్వర్‌బీ, కిషోర్, ఉషన్న, దత్తయ్య, ఎం.అరుణ్ తదితరులు పాల్గొన్నారు.