Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
యువతకు క్రీడలతోనే మానసిక ఉల్లాసంతో పాటు మనోధైర్యం కల్గుతుందని కౌన్సిలర్లు కె.లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్ అన్నారు. ఆదివారం జల్పల్లి మున్సిపల్లోని శ్రీరాం కాలనీలో క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు క్రీడల్లో రాణించే విద్యార్థినీ, విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం క్రీడాకారులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు భీమ్ సార్, మారుతీ తదితరులు పాల్గొన్నారు.