Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని భ్రమరాంబికా నగర్లో కాలనీ వాసులు ఆదివారం కాలనీ పార్కులో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి స్థానిక కార్పొరేటర్ శ్రావణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు సీసీపీఎల్ నుంచి పటేల్‌నగర్‌కు వెళ్లే నాలా తమ కాలనీ మీదుగా వెళ్తుందనీ, అందువల్ల వర్షాకాలంలో అది ఓవర్ ప్లో అవుతుందనీ, తదితర సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్పొరేటర్ స్పందించి వెంటనే సమస్య గురించి అధికారులతో మాట్లాడి పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుం టామని కాలనీ వాసులకు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు సాయి, లీలావతి, విభా, కార్తీక్, స్థానిక కాలనీ సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు రాంబాబు, కిషన్, శివానంద్ పాల్గొన్నారు.