Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ కార్పొరేటర్‌గా ఎన్నికై ఏడాది పూర్తి చేసు కున్న సందర్భంగా ఆదివారం డివిజన్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ దంపతులను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కేక్ కట్ చేయించి సన్మా నించారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వివిధ కాలనీల అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్‌కు అభినంద నలు తెలిపారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడు తూ 141 డివిజన్ కార్పొరేటర్‌గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సేవ చేయడానికి కార్పొరేటర్‌గా తన గెలుపునకు సాయశక్తులా కృషి చేసిన డివిజన్ పార్టీ సీనియర్ నాయకులకు, మహిళా నాయకులకు, వివిధ కాలనీల అసోసియేషన్ సభ్యులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏడాది కాలంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో డివిజన్లోని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ రోడ్లు, డ్రయినేజీ, తాగునీరు, వీధి దీపాలు, తదితర సమస్యలను పూర్తి చేయగలిగామన్నారు. డివిజన్లో ఇంకా ఏమైనా సమ స్యలు ఉంటే వాటిని దశలవారీగా పూర్తి చేస్తామని కార్పొ రేటర్ హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీని యర్ నాయకులు రాము యాదవ్, టీఆర్ఎస్ నాయకులు, మహిళా నాయకులు, తదితరులు పాల్గొన్నారు.