Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని తూర్పు జెఏసీ విభాగంలో ఉన్న దాదాపు 18 కాలనీవాసుల సమస్యలు పరిష్కరించాలని కాలనీ వాసుల విన్నపం మేరకు ఆదివారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కార్పొరేటర్లు కాలనీలకు విచ్చేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తమ సమస్యలను వారికి తెలిపారు. ముఖ్యంగా యూజీడీ వ్యవస్థ, మంచినీటి సౌకర్యం, రోడ్లు, సీసీ కెమెరాల గురించి కాలనీవాసులు ప్రస్తావించారు. అక్కడికి విచ్చేసిన ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ముఖ్యంగా యూజీడీ, మంచినీటి పనులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామనీ, దాదాపు 90 శాతం మేర యూజీడీ పనులు పూర్తయ్యాయని తెలిపారు. శివారు ప్రాంతాల్లో ఉండటం వల్ల కొంత మేర ఆలస్యం జరిగిందని తెలిపారు. తప్పకుండా చివర వరకు ఉన్న ఇండ్ల వారికి యూజీడీ లైన్స్ వేయిస్తామని హామీనిచ్చారు. వచ్చే డిసెంబర్ వరకు శివారు ప్రాంతాల్లో ఉన్న అన్ని ఇండ్ల వారికి మంచినీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యం అన్నారు. అన్ని మౌళిక వసతులు కల్పించాక రోడ్లు, సీసీ కెమెరాలు ఎర్పాటు చేయిస్తామని తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు, పలు కాలనీ జేఏసీ సభ్యులు మాధవరెడ్డి, శేఖర్ రెడ్డి, నవీన్ రావు, ప్రశాంత్ రెడ్డి, హరినాధ్, సాయి గౌడ్, పీ.వీ.రావు, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.