Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
కంటోన్మెంట్ బోర్డు మూడో వార్డు అంబేద్కర్‌నగర్ మర్డ్ ఫోర్ట్ అంబేద్కర్ గుడిసెల ప్రాంతంలో ఆదివారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ గుడిసె వాసులు ప్రతినిధి అశోక్ కొమురయ్య తదితరులు ఏర్పాటు చేసిన కార్యక్ర మానికి ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ బోర్డు సభ్యులు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, సదా కేశవరెడ్డి, మాజీ సభ్యులు ప్రభాకర్, పోలీసు అధికారి మధు, తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అంబే ద్కర్ విగ్రహ దాత నర్సింహారెడ్డిని శాలువాలతో సన్మానిం చారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడు అనీ, ఆయన చేసిన సేవలు గణనీయమైనవి అనీ, బడుగు బలహీన వర్గాల వారు సుఖసంతోషాలతో ఉన్నారంటే మహనీయుని పుణ్యమేనని కొనియాడారు. అనంతరం అంబేద్కర్ గురించి ప్రతినిధి అశోక ఆధ్వ ర్యంలో అన్నదాన కార్యక్రమం స్థానికులు నిర్వహించారు.