Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్నగర్
ఆర్కేపురం డివిజన్ వివిధ కాలనీలో గల పార్కుల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలని డివిజన్ కార్పొరేటర్ రాధ ధీరజ్ రెడ్డి జీహెచ్ఎంసీ, హార్టికల్చర్ అధికారులకు సూచించారు. మంగళవారం కార్పొరేటర్ అధికారులు, కాలనీ ప్రెసిడెంట్లతో కలిసి పార్కులను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్కులో ఉన్న గ్రాస్ కటింగ్ మిషన్లు, చెట్లు పోయినకాడ నూతన చెట్లు, కాలనీ వాసులకి వాకింగ్ ట్రాక్ నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హార్టీకల్చర్ అధికారులు డీడీ రాజ్ కుమార్, మేనేజర్ సత్యనారాయణ, కాలనీ ప్రెసిడెంట్లు బాపు, యాదిరెడ్డి, ఆర్కేపురం డివిజన్ సెక్రెటరీ సాయి, ఈస్ట్ యాదవ్ నగర్ సెక్రెటరీలు రఘు, ఏరియా కమిటీ మెంబర్ రమేష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.