Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్‌పేట
రాష్ట్ర ప్రభుత్వ స్వఛ్చ్ సర్వెక్షన్లో భాగంగా తడి, పొడి చెత్త, ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలు అవగాహన కలిగి ఉండా లని 18వ వార్డు కౌన్సిలర్ కే.లక్ష్మినారాయణ అన్నారు. మంగళవారం జల్పల్లి మున్సిపాల్టీలోని 18వ వార్డులోని శ్రీరాం కాలనీలో గల కోటి విద్యాలయ ఉన్నత పాఠశాలలో ప్లాస్టిక్ నిషేధంపై పురపాలక సంఘం మెనేజర్ క్రాంతి కుమార్ అద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కౌన్సిలర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్య ఇస్తుంద న్నారు. ముఖ్యంగా ప్రజలకు హానిచేసే ప్లాస్టిక్ వస్తువుల ను ఎవ్వరూ వినియొగించరాదని విద్యార్థులకు సూచిం చారు. జూట్ బ్యాగులు, టిపిన్ బాక్స్‌లను ప్రజలు విని యోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోటి విద్యాల య సంస్థల అధినేత సచిన్ సోనీ, మున్సిపల్ మీడియా సెల్ కన్వీనర్, మాజీ అర్మిమెన్ కే.వాసుబాబు, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సూపర్వైజర్ కుమార్, మున్సిపల్ సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.