Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. హైదరాబాద్ బాస్కేట్ బాల్ అసోసియేషన్ అధ్వర్యంలో లాల్ బహదూర్ స్టేడియంలో నూతనంగా బాస్కేట్ బాల్ కోర్టును ఏర్పాటు చేయాలనే విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ అదేశాల మేరకు మంత్రి క్షేత్ర స్థాయిలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా స్కేటింగ్ రింక్‌లో స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న క్రీడాకారులతోనూ అక్కడ ఉన్న వారి తల్లి దండ్రులతో అక్కడి పరిస్థితులపై మంత్రి చర్చించారు. క్రీడాకారులు, కోచ్‌లను వారి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. చాలా ఏండ్ల క్రితం నిర్మించిన ఈ స్కేటింగ్ రింక్ అనువుగా లేదనీ, ప్రాక్టీస్‌కు అనుకూలంగా లేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు, కోచ్‌ల విజ్ఞప్తి మేరకు స్కేటింగ్ రింక్‌ను భవిష్యత్ అవసరాల దృష్ట్యా అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ది చేయాలని మంత్రి శాట్స్ అధికారులను అధేశించారు. ప్రస్తుతం ఉన్న స్కేటింగ్ రింక్‌ను విస్తరించి వాటిలో ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను అదేశించారు. వెంటనే ప్రతిపాదనలు సిద్దం చేసి తనకు పంపించాలని అధికారులను అదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా రూపొందించాలనే లక్ష్యంతో క్రీడల అభివృద్ధికి అనేక చర్యలను చేపట్టుతున్నామన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో క్రీడా మైదానా లను నిర్మిస్తున్నామన్నారు. క్రీడల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ క్రీడా పాలసీని రూపొందించేందుకు క్యాబినెట్ సబ్ కమీటీని నియమించారని తెలిపారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి దేశంలోనే అత్యత్తమ క్రీడా పాలసీని తయారు చేస్తున్నామన్నారు. అనంతరం మంత్రి క్రీడాశాఖ అథికారు లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో బాస్కేట్బాల్, స్కేటింగ్ క్రీడల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలతోపాటు ప్రగతిని ఆయా క్రీడా సంఘాల ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వ రరెడ్డి, రావుల శ్రీధర్‌రెడ్డి, శాట్స్ ఉన్నతాధికారులు సుజాత, ధనలక్ష్మీ, మనోహర్, దీపక్, తదితరులు పాల్గొన్నారు.