Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కీసర మండల ప్రాధమిక ఆరోగ్య ఉప కేంద్రంలో వైద్యాధికారి మొలుగు సరిత రెడ్డి వినతి మేరకు పేద రోగుల సౌకర్యార్థం ఆరోగ్య కేంద్రానికి నాగారం మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ కోమిరెల్లి అనిత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు 10 లీటర్స్ కెపాసిటీ గల గీజర్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి మొలుగు సరిత రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కోమిరెల్లి సుధాకర్ రెడ్డి, పైళ్ల మల్లా రెడ్డి, కొత్త గోపాల్ రెడ్డి, మామిడి నవీన్ రెడ్డి, మొలుగు భాస్కర్ రెడ్డి, రంగనాయకమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.