Authorization
Sun March 30, 2025 11:30:01 am
నవతెలంగాణ-మల్కాజిగిరి
వ్యాక్సిన్‌పై ఎలాంటి సందే హాలు పెట్టుకోవద్దనీ, 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓమైక్రోన్ వైరస్‌ను దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్ తీసుకోవాలని మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ అన్నారు. మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని మారుతి నగర్‌లోని గ్రౌండ్లో మంగళవారం వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో కార్పొరేటర్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు సదానందంగౌడ్, జై కృష్ణ, బీజేపీ నాయకులు గన్న, చందు, మహేష్, శివానంద్, లడ్డు, తదితరులు పాల్గొన్నారు.