Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
హమాలీ బస్తీ ప్రజల సమస్యలను రైల్వే అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసంలో బన్సీలాల్‌పేట డివిజన్ లోని హమాలీ బస్తీ ప్రజలు మంత్రిని కలిసి తమ సమస్య లను విన్నవించారు. సుమారు 70 ఏండ్లకు పైగా తాము ఇక్కడే నివాసిస్తున్నామనీ, హమాలీ బస్తీ నుంచి రాకపో కలు సాగించేందుకు ఉన్న ఒక్క రహదారిని మూసి వేసేం దుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారని మంత్రికి విన్న వించారు. ఇదేంటని రైల్వే అధికారులను ప్రశ్నిస్తే తమను రైల్వే పోలీసులతో భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వివరించారు. స్పందించిన మంత్రి నార్త్ జోన్ డీసీపీ కలమే శ్వర్‌తో ఫోన్లో మాట్లాడి హమాలీ బస్తీకి ఉన్న రహదారిని మూసివేయకుండా రైల్వే అధికారులతో చర్చించాలని ఆదేశించారు. సుమారు 2 వేల కుటుంబాలు నివసిస్తున్న హమాలీ బస్తీకి ఉన్న ఏకైక రహదారిని రైల్వే అధికారులు మూసివేస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని మంత్రి వివరించారు.