Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
వెస్లీ విద్యా సంస్థలు విలువలతో కూడిన విద్యను అందించేందుకు పాటుపడుతూ సమాజానికి ఉత్తమ పౌరులను అందించేందుకు కృషి చేస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్లీ బార్సు జూనియర్ కాలేజ్ స్వర్ణోత్సవాలు మంగళవారం కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరై మాట్లాడారు. నాడు విద్యా సంస్థలు కేవలం విద్యతో సమాజ మార్పు కోసం పాటుపడేవనీ, నేడు మాత్రం కేవలం వ్యాపారమే ధ్యే యంగా చాలా సంస్థలు నడుస్తున్నాయన్నారు. వెస్లీ కళాశా లలో అటు విద్యతో పాటు క్రీడలను కూడా ఎంతో ప్రోత్స హించే వారనీ, అందువల్ల ఎంతో మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఇక్కడి నుంచే వచ్చారని గుర్తు చేశారు. ఇలాంటి విద్యా సంస్థ స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ కూడా విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఎన్నడూలేని విధంగా అనేక గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఒక విద్యార్థికి మంచి విద్యను అందించే తన కుటుంబాన్నే కాకుండా తన విజ్ఞానంతో సమాజాన్ని కూడా ముందుకు నడిపిస్తారని తెలిపారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న వెస్లీ కళాశాలకు భవిష్యత్లో ఎలాంటి అవసరం ఉన్నా తాను అండగా ఉంటానని హామీనిచ్చారు. ఈ సందర్భంగా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల పోస్టల్ స్టాంపు, సావనీరును విడుదల చేశారు. ఈ సందర్బంగా విద్యార్థినీ, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పూర్వ విద్యార్థులందరూ హాజరై ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకుంటూ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నా రు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ మోజస్ పాల్, సీఎస్ఐ మెదక్ డయాసిస్ వైస్ చైర్మెన్ రెవరెండ్ భాస్కర్, డిగ్రీ, పీజీ కళాశాలల డైరెక్టర్ విమల్ సుకుమార్, డయాసిస్ ప్రతినిధులు చార్లెస్ వెస్లీ, సత్యానందం, ఎం.డేవిడ్, వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు డేనియల్, రెవరెండ్ ప్రసన్నకుమార్, ప్రేమ్ సుకుమార్, పూర్వ విద్యార్థులు అల్లాడి రవి, తదితరులు పాల్గొన్నారు.