Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం ఇవ్వాలని సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా కార్యదర్శి పి.సత్యం డిమాండ్ చేశారు. మంగళవారం కీసరలోరని జిల్లా ప్రెస్ క్లబ్ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మేడిపల్లి మండలం పీర్జాదిగూడలో సీపీఐ(ఎం) మేడ్చల్ జిల్లా మహాసభలు ఇటీవల విజయవంతంగా జరిగాయన్నారు. పేద ప్రజల పక్షాన సీపీఐ(ఎం) నిరంతరంగా పోరాటం చేస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో అసమర్థ పరిపాలన చేస్తుందన్నారు. మేడ్చల్ నియోజక వర్గంలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి చెత్తను ఇక్కడకు తరలించకుండా హైదరాబాద్ నలుమూలలలో డంపింగ్ యార్డులు నిర్మించి రీసైక్లింగ్ చేయాలన్నారు. మేడ్చల్ జిల్లాలో అభివృద్ధి పేరిట భూములు కోల్పోయిన నిర్వాసితులకు 2013 భూ నిర్వా సితుల చట్టం ప్రకారం నష్ట పరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లాలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలనీ, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడంతోపాటు మండల కేంద్రంలో జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మించాలన్నారు. నాచారంలో ఈఎస్ఐ ఆస్పత్రి పెండింగ్ పనులను పూర్తి చేసి రాష్ట్ర ఈఎస్ఐకి వెంటనే అప్పజెప్పేలా కేంద్ర ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమా వేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చంద్ర శేఖర్, అశోక్, వినోద, జిల్లా కమిటీ సభ్యులు పి.వెంకట్, సంతోష్, కీసర మండల కన్వీనర్ భాస్కర్ పాల్గొన్నారు.