Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
పంజాగుట్టలోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్స్ హాస్పిటల్లో పడకల సంఖ్యను పెంచుతామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. నిమ్స్‌లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మంగళవారం మంత్రి నిమ్స్ హాస్పిటల్లో ఎండోస్కోపీక్ ఎక్విప్మెంట్, ఎంఅర్ యూ ల్యాబ్, స్టెమ్ సెల్ రీసెర్చ్ ఫెసిలిటీ, ఫిజియోథెరపీ విభాగం, బోన్ డెన్సిటోమీటర్, శాంపిల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం, వాటర్ ఏటీఎంలను ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌లోని అన్ని విభాగాల హెచ్ఓడీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రూ.12 కోట్లతో వివిధ మెడికల్ ఎక్విప్మెంట్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామ న్నారు. అందులో ముఖ్యంగా మెడికల్ జెనటిక్ ల్యాబోరేటరీ అందుబాటులోకి వచ్చిందన్నారు. వారసత్వంగా వచ్చే జన్యు లోపాలను సవరించే అత్యాధునిక ల్యాబ్, మల్టీ డిసిప్లనరీ రీసెర్చ్ యూనిట్, బోన్ డెన్సిటీవ్ మీటర్‌ను నిమ్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. బోన్స్ డెన్స్ ఎంత ఉంది అని టెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుందనీ, ఇది రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఎక్కడా లేదనీ, తొలి సారిగా అందుబాటులోకి తెచ్చామ న్నారు. న్యుమాటిక్ వ్యూ సిస్టంను అందుబాటు లోకి తీసుకొచ్చా మనీ, టెస్టింగ్ శాంపిల్స్‌ను అందులో పెడితే అది ల్యాబ్‌లోకి వెళ్తుందనీ, తిరిగి ఆ ఫలితాలు రిటర్న్ తెస్తుందన్నారు. నిమ్స్‌లో గతంలో బెడ్ దొరకడం కష్టంగా ఉండేదనీ, కేసీఆర్ నిమ్స్‌ను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మరో 200 పడకల ఐసీయూ బెడ్స్‌ను మంజూరు చేశారనీ, ఈ బెడ్స్ పనులను జనవరి 15వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ బెడ్లు పూర్తయితే పేద ప్రజలకు నిమ్స్‌లో 350 ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి వస్తాయని చెప్పారు. గతంలో వెంటిలెటర్ దొరకాలంటే కష్టంగా ఉండేదనీ, పేదవారు వెంటిలెటర్‌పై ఉండాలంటే రూ.లక్షలు ఖర్చు అయ్యేదనీ, ఈ వెంటలేటర్లు 89 మాత్రమే ఉన్నాయనీ, 120 వెంటిటేలర్లును కొత్తగా తీసుకొస్తున్నా మని తెలిపారు. రానున్న 45 రోజుల్లో వెంటిలెటర్లు, ఐసీయూ బెడ్స్ అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. హెచ్‌వోడీలతో మాట్లాడితే కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం ప్రభుత్వ రంగంలో అందించాలంటే కొంత ఎక్విప్మెంట్ కావాల న్నారనీ, రెడియాలజీ, పాథాలజీ, మైక్రోబ యాలజీ, బయోకెమస్ట్రీ, నెఫ్రాలజీ, యూరాలజీ, కార్డియాలజీ, న్యూరో సర్జరీ డిపార్టమెంట్ల నుంచి రిక్వేస్ట్‌లు వచ్చాయని ఇందుకు రూ.153 కోట్లు అవసరం అవుతుందన్నారు. ఇతర డిపార్ట్మెంట్లకు కావాల్సిన అత్యాధునిక మెడికల్ యంత్ర పరికరాలు కావాలని అడిగారని తెలిపారు. అన్నీ మంజూరు చేస్తామని చెప్పారు. రూ.154 కోట్లను కొత్త ఎక్విప్మెంట్లు కొనడానికి తక్షణమే మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడి వైద్య సేవలు అందిం చాలన్నదే తమ లక్ష్యం అన్నారు. ఆరోగ్య శ్రీ కింద ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ చేస్తున్నామనీ, ఇప్పుడు ఐదుగురు అక్కడ చికిత్స పొందుతున్నారని తెలిపారు. నిమ్స్‌లో 8 పడకల బోన్ మారో ట్రాన్స్ ప్లాంటేషన్ పడకలున్నాయని తెలిపారు. ఇలా ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని చెప్పారు. నిమ్స్‌తో పాటు మరో 4 ఆస్పత్రులను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నామనీ, అధికారులు అంచనాలు తయారు చేస్తున్నారని తెలిపారు. అల్వాల్, గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్, టిమ్స్, ఛెస్ట్ ఆస్పత్రిలో నాలుగు వైపులా వెయ్యి పడకల ఆస్పత్రులు, తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కింద ఈ నాలుగు సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులను అటా చ్డ్గా తీసుకురావాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిపారు. హైరిస్క్ ప్రెగెంట్ పెషెంట్లకు ఇబ్బందుల ఉన్నాయనీ, నిమ్స్‌లో ఈ సౌకర్యం లేదన్నారు. గర్భిణుల కిడ్నీ, గుండె, హై బీపీతో బాధపడవచ్చు అనీ, అలాంటి వాళ్లకు సాయం చేసేందుకు గైనకాలజీ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని అడిగినట్టు తెలిపారు. 200 పడకల ఎంసీహెచ్ హాస్పిటల్‌ను నిమ్స్‌కు అటాచ్డ్గా తేవా లని నిర్ణయించామని తెలిపారు. జీహెచ్ఎంసీ వాళ్లతో మాట్లాడి రూ.5 భోజనం ఇక్కడ రోగుల సహాయకుల కోసం ఏర్పాటు చేయాలని కోరనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు రాలేదనీ, అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా వ్యాక్సిన్‌పై ప్రచారం నిర్వహించాలని కోరారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రతి రోజూ లక్ష దాకా నిర్దారణ పరీక్షలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.