Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
ఎస్సీ వర్గీకరణ సాధించుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తాం అని ఎమ్మార్పీఎస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు రుక్కమ్మ అన్నారు. ఈనెల 13న తలపెట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమానికి మద్దతుదారులు, మహిళాలోకం కదిలిరావాలని పిలుపునిచ్చారు. మంగళవారం విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో మహిళా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై కేంద్రం నుంచి స్పష్టత వచ్చే వరకు ఢిల్లీలోనే ఉంటామని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు రావాలని కోరారు. సాధ్యంకాని ఎన్నో చట్టాలు తీసుకువచ్చిన ప్రధాని నరేంద్రమోదీ ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నారు. వర్గీకరణ సాధించుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు. మహిళా సంఘం సమన్వయకర్త డాక్టర్ మీసాల మల్లేష్ ఆధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, భాగ్యమ్మ, సుగుణమ్మ, బొల్లం జ్యోతి, ఎస్.లక్ష్మి పాల్గొన్నారు.