Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
కొత్త స్థానిక కేడర్లకు ఉద్యోగుల కేటాయింపు, పూర్వ స్థానిక కేడర్లలో సీనియారిటీ జాబితాలు సిద్దం చేయాలని ఆదేశాలిచ్చిన ప్రభుత్వానికి, ఇచ్చిన మాట నిలుపుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు టీఎన్జీవోస్ యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం.హుస్సేని(ముజీబ్) మంగళవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 8వ తేదీలోపు ఉద్యోగుల జాబితాలు సంబంధిత కార్యాలయ ఉన్నతాధికారులకు అందజేయాల్సి ఉంటుంది.