Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
ఓ రోడ్డు ప్రమాదం కేసు నమోదు విషయంలో బాధితుల నుంచి రూ.పదివేలు లంచం డిమాండ్ చేసిన ఎస్సై ఏసీబీకి చిక్కిన సంఘటన మేడిపల్లి పీఎస్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం మేడిపల్లి పోలీసు స్టేషనులో ఎస్సైగా పని చేస్తున్న సీహెచ్ యాదగిరి రాజు డిసెంబర్ 1న బోడుప్పల్ హెచ్ పీ పెట్రోల్ బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసు విషయంలో బాధితుడికి సర్టిఫికెట్ ఇచ్చేందుకు గాను రూ.20 వేలు డిమాండ్ చేశాడు. బాధితుడు తమ వద్ద అంత డబ్బు లేదని చెప్పగా చివరకు పది వేలు తీసుకోవడానికి అంగీకరించాడు. బాధితుడి కుమారుడు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మేడిపల్లి పోలీసు స్టేషనులో రూ.10 వేలు ఇవ్వగా.. పోలీసు టోపి కింద పెట్టాడు. ఇదంతా గమనించిన ఏసీబీ అధికారులు ఎస్సైని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని విచారణ జరిపారు. అనంతరం రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.