Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ విజరుకుమార్ గౌడ్ మంగళవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి యువతకు క్రీడా సామగ్రి అందజేసి ప్రోత్సహించాలని కోరారు. యువత క్రీడల్లో రాణిస్తూ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నామని అన్నారు. అనంతరం విజరు కుమార్‌గౌడ్ మాట్లాడుతూ అంబర్‌పేట డివిజన్ పరిధిలోని యువతను క్రీడల్లో ప్రోత్సహించేందుకు క్రీడా సామగ్రి అందజేయడంతో పాటు గ్రౌండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరినట్లు చెప్పారు. అనంతరం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీగా ఎన్నికైన ఇ.విజరు కుమార్‌గౌడ్‌ను శాలువాతో సత్కరించారు.