Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్నగర్
పోలీసుల స్పోర్ట్స్ మీట్ సిబ్బందిలో నూతనోత్సాహం నింపుతుందని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సంతోషం వ్యక్తం చేశారు. సరూర్నగర్ స్టేడియంలో రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో 4వ వార్షిక స్పోర్ట్స్ మీట్-2021ను ఐపీఎస్ రవిగుప్తతో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కోవిడ్ తర్వాత నిర్వహిస్తున్న స్పోర్ట్స్ మీట్ సిబ్బందిలో నూతనోత్సాహం నింపుతుందన్నారు. నాలుగు రోజుల పాటు మొత్తం 35 రకాల క్రీడలు జరుపుతున్నామని వెల్లడించారు. ఈనెల 10న మీడియాతో రాచకొండ పోలీసుల ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఉందని, ఇందులో మీడియా మిత్రులందరూ పాల్గొనాలని కోరారు. క్రీడల చివరి రోజు ఫైనాన్స్ హోం ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణరావు హాజరవుతారని తెలిపారు. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, పోలీసు వ్యవస్థలో ఒక మంచి ఫ్రెండ్లీ వాతావరణం కోసం ఇవి దోహదపడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.