Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
నిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేతనాలు పెంచాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు నిమ్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ విజ్ఞప్తి చేసింది. మంగళవారం నిమ్స్‌లో పలు అబివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రిని కలిసిన యూనియన్ నేతలు ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. సుమారు 25 ఏండ్లుగా నిమ్స్ ఆస్పత్రిలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న కార్మికులకు ఇప్పటికీ రూ.14 వేలకు మించి వేతనం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో ప్రతిష్ఠాత్మక నిమ్స్ ఆస్పత్రిలో పనిచేస్తూ కనీస అవసరాలు తీర్చుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్న అని మంత్రికి వివరించారు. సీనియారిటీ ప్రకారం కార్మికులను రెగ్యులరైజ్ చేయడంతోపాటు రిటైర్ అయిన కాంట్రాక్ట్ కార్మికులకు పెన్షన్ అందజేయాలని కోరారు.