Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
నవతెలంగాణ-హైదరాబాద్
ప్రజా సమస్యలపై అలసత్వం వద్దు అని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలో అన్ని పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని, ఇకపై ప్రతి మూడు నెలలకోసారి అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. సికింద్రాబాద్ పరిధిలో అభివృద్ధి కార్యకలాపాలపై మంగళవారం సీతాఫల్మండీలోని తన క్యాంపు ఆఫీస్లో అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ లాలాపేటలో అంతర్జాతీయ ప్రమాణాల స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పనులను వెంటనే ప్రారంభించాలని, రోడ్డు విస్తరణ పనులను మరో నెల రోజుల్లో పూర్తిచేసి వెంటనే పరిహారాన్ని అందించాలని చెప్పారు. తుకారాం గేటులో ఫిబ్రవరి నెలాఖరులోగా, మాణికేశ్వరి నగర్లో వీలైనంత త్వరగా ఆర్యూబీ పనులను ప్రారంభించాలని ఆదేశించారు. సమావేశంలో జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ మోహన్ రెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారి విజయ కుమారి, ట్రాన్స్ కో డివిజనల్ ఇంజినీర్ శ్రీధర్, జలమండలి జనరల్ మేనేజర్ రమణా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆశాలత, తహసీల్దార్లు జానకి, సునీల్ కుమార్, అధికారులు డాక్టర్ రవీందర్ గౌడ్, గంగాధర్ పాల్గొన్నారు.