Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం దేశానికి తీరని లోటు అని బీజేవైఎం నేషనల్ ఆఫీస్ కో ఆర్డినేటర్ కుమార్ యాదవ్ అన్నారు. ఆల్విన్ కాలనీలో డివిజన్ అధ్యక్షులు కమలాకర్‌రెడ్డి బిపిన్ రావత్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. దేశం ఒక గొప్ప సైనికున్ని కోల్పోయిందన్నారు. రావత్‌తోపాటు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాఘవేందర్, నర్సింహరెడ్డి, రఘు తదితరులు పాల్గొన్నారు.