Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్ పేట
మూడు చింతలపల్లి మండలంలోని కొల్తుర్ గ్రామంలో టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు రవీందర్ రావు శర్మ వాళ్ల పెద్దమ్మ సుశీలబాయి మరణించారు. సమాచారం అందుకున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆర్థిక సహాయం చేయాలని పార్టీ శ్రేణులను అదేశించగా మతురాలి కుటుంబానికి రూ. 5 వేలు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో కొల్తుర్ గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు దుర్గం వెంకటేష్ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ సలెంద్రి మల్లేశ్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్‌గౌడ్, యూత్ ప్రెసిడెంట్ సలెంద్రి రాజు యాదవ్, యూత్ సెక్రెటరీ సలెంద్రి నవీన్ యాదవ్, మూడుచింతల పల్లి మండల అధ్యక్షుడు గుండ్లపల్లి మల్లేష్‌గౌడ్, మాజీ అధ్యక్షులు శ్రీనివాస్‌గుప్తా, సొసైటీ డైరెక్టర్ కొండ బిక్షపతి, మేడ్చల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, వార్డు సభ్యులు టీ.మురళి, చేవ్వ లక్ష్మణ్, బక్కగారి భూపాల్ రెడ్డి, కొండ సుధాకర్, కొండ సత్యనారాయణ, మంద అంజి రెడ్డి, సీనియర్ నాయకులు బుట్టంగారి నర్సింహ రెడ్డి, సలెంద్రి సత్యనారాయణ యాదవ్, దత్తుగౌడ్, గిరిపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.