Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అబ్దుల్లాపూర్ మెట్
తప్పిన పోయిన బాలుని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించిన ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలో పెద్ద అంబర్ పేట ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపై గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ స్వామి తెలిసిన వివరాల ప్రకారం... రాం పల్లి నుంచి గుంటూరుకు నందమూరి నాని, స్వాతి, వారి కుమారుడు విక్కీ (05) టూ వీలర్‌పై వెళ్తుండగా అబ్దుల్లాపూర్ మెట్ మండలం, బాచారం గ్రామ సమీపంలోకి రాగానే మూత్ర విసర్జనకు వెళ్లగా బాలుడు కనిపించకుండా పోయాడు. సమీపంలో వెతికినా ఆచూకి లభించకపోవడంతో 100 నెంబర్‌కు పోన్ చేశారు. అక్కడి నుంచి అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు మొబైల్ 2కు సమాచారం చేరడంతో కానిస్టేబుల్ యాదగిరి, డ్రైవర్ బాలరాజులు బాధితుల వివరాలు తెలుసుకొని ఘటన ప్రాంతాల్లో బాలుని వెతికిపట్టుకుని తల్లిదండ్రులకు అప్పజెప్పారు. దీంతో బాలుని తల్లిదండ్రులు పోలీసులను అభినందిస్తూ, ధన్యవాదాలు తెలిపారు.