Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
నెలాఖరులోగా వందశాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని మీర్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ దుర్గాదీప్ లాల్ చౌవాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కార్పోరేషన్ కార్యాలయంలో కార్పొరేటర్లు, అధికారులకు స్వచ్ఛ సర్వేణ్, వందశాతం వ్యాక్సినేషన్ అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ... రెండేండ్లుగా కొవిడ్‌తో పోరాడుతున్నామని, ఒకవేళ థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ రెండు డోసులు వ్యాక్సినేషన్ వేసుకొని ఉండాలని చెప్పారు. ఈ నెలాఖరు వరకు కార్పొరేటర్లు, బిల్ కలెక్టర్లు వ్యాక్సినేషన్ వేయించాలని ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయకూడదని, కేవలం చెత్త ఆటోలో మాత్రమే తడి, పొడి చెత్తను వేరుచేసి వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నాగేశ్వర్, బాలాపూర్ పీహెచ్ఎస్ మెడికల్ ఆఫీసర్లు రవి, సుధాకర్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
35 మంది కార్పొరేటర్లు డుమ్మా
వ్యాక్సినేషన్, స్వచ్ఛసర్వేక్షణ్ వంటి అంశాలపై అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం కార్పొరేటర్లు, మున్సిపల్, ఆరోగ్యశాఖ అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశానికి 35 మంది కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. 11 మంది హాజరయ్యారు. ఓమిక్రాన్ వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందని దాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం అందరిని అప్రమత్తం చేస్తుంటే మన కార్పొరేటర్లు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ముఖ్యమైన సమావేశానికి గైర్హాజరు కావడంపట్ల పలు రకాల విమర్శలకు తావిస్తోంది.