Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సహజసిద్ధమైన ప్రకృతి, పర్యావరణం మానవ మనుగడకు ఎంతో అవసరం. ప్రకృతి, పచ్చదనం, స్వచ్ఛమైన పరిసరాలు వాతావరణ సమతుల్యతను కాపాడటమేగాక, మనుషుల జీవన మనుగడకు త్పోడతాయి. ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడాలంటే కలుషితం లేని ప్రకృతి, పర్యావరణం చాలా ముఖ్యం. ఆ విధమైన వాతావరణం ఏర్పడేలా ప్రయత్నించడం మనంది బాధ్యత కావాలి. అందుకోసం పర్యావరణంపై అవగాహన పెంపొందించుకోవాలి. పర్యావరణానికి ఏర్పడే ముప్పు, దాని నివారణ వంటి అంశాలపై చర్చించడానికి, సమస్యల పరిష్కారానికి ఐక్యరాజ్యసమితి కూడా ఏటా జూన్ 5న పర్యావరణ దినోత్సవాన్ని జరపాలని 1974లో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. గ్లోబల్ వార్మింగ్, అడవుల నరికివేత, గాలి కాలుష్యం, ప్లాస్టిక్ వాడకం వంటివి నివారించేందుకు, సమస్యలపై చర్చించేందుకు, కార్యాచరణ కోసం ఏటా 143 దేశాలు పర్యా వరణ దినోత్సవంలో భాగ స్వామ్యంఅయ్యేలా ఐక్యరాజ్య సమితి చర్యలు తీసుకుంది. పర్యావరణంపై అవగాహన పెంచేందుకు ఏటా ఒక్కో 'థీమ్'ను ఎంచుకుని కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వాతావరణంలో మార్పులు, ప్రకతి వైపరీత్యాలు, భూకంపాలు, సునామీలు, అగ్ని పర్వతాలు బద్దలవడం, ఇండిస్టియల్ పొల్యూషన్వంటివి మానవాళిపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటువంటి కాలుష్యాలవల్ల ప్రపంచ వ్యాప్తంగా ఏటా 12 లక్షల మంది ప్రాణాలు కోల్పో తున్నారని వివిధ సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కువగా కాలుష్యం కలిగిన వంద సిటీల జాబితాలో మన దేశానికి చెందినవే 15 ఉన్నాయనిప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక స్పష్టం చేసింది. కరోనాతో ప్రభావితమైన దేశాల్లో ఎయిర్, వాటర్, సౌండ్ పొల్యూషన్ కొంతమేర తగ్గిందని పర్యావరణ పేర్కొంటున్నారు. విద్యార్థులు, రైతులు, ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు వాతావరణ, పర్యావరణ, ప్రకృతి పరిరక్షణకోసం తమ తమ పద్ధతుల్లో కృషి చేయాలి. అంతేకాదు ప్రజలు ప్రకృతి, ఆరోగ్యకరమైన పర్యావరణ పరిరక్షణ తమ బాధ్యతగా భావించాలి. అప్పుడే ఆహ్లాదకరమైన, ఆరోగ్య కరమైన ప్రకృతి పరిఢవిల్లుతుంది. ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది.
- గద్దె శ్రీనివాసరావు