Authorization
Sat March 22, 2025 05:22:39 pm
కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మించిన రోడ్డు పక్కన సుందరీకరణలో భాగంగా పర్యావరణం, పచ్చదనం కోసం మొక్కలు నాటడంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుందని బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి సర్కిల్ అధికారులకు సూచించారు. ప్రధాన రహదారి బొజై కళ్యాణ మండపం నుండి కాళ భైరవ స్వామి దేవాలయం వరకు అంతర్గత రోడ్డు వెంబడి మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించడంతో పనులను ప్రారంభించారు. కార్పొరేటర్ పనులను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రంగంపేట్ శ్రీనివాస్ ముదిరాజ్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.