Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
సోనియా గాంధీ చొరవతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్ అన్నారు. ఘట్కేసర్ మండలం ఘణపూర్ గ్రామంలో గురువారం స్థానిక ఇన్చార్జీ సర్పంచ్ బద్దం గోపాల్ రెడ్డి ఆద్వర్యంలో పవర్ గ్రీడ్ ముందు కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి పార్టీ సభ్యత్వ నామోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోనియా గాందీ జన్మదినం సందర్భంగా స్థానికంగా ఉన్న చైల్డ్ గైడెన్స్ సెంటర్లో ఘట్కేసర్కు చెంది కందకట్ల మాధవ రెడ్డి సహకారంతో 15వేల విలువగల ప్రొజెక్టర్ అందజేశారు. అనంతరం హెలికాప్టర్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన త్రివిధ దళపతి బిపిన్ రావన్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర మహిళ కార్యదర్శి సగ్గు అనిత, పార్టీ సీనియర్ నాయకులు కట్ట జనార్ధన్ రెడ్డి, ఎన్వై భాను ప్రకాష్, ఎంపీటీసీ గట్టగల్ల రవి, వార్డు సభ్యులు వేముల పరమేష్ గౌడ్, చిలుగూరి భాస్కర్, వేముల శోభ, కో ఆప్షన్ సభ్యులు నానావత్ సురేష్ నాయక్, పైళ్ల లత రెడ్డి, మాజీ సర్పంచ్లు వేముల మమత గౌడ్, నానావత్ రూప్ సింగ్ నాయక్, నాయకులు వేముల సత్తయ్య గౌడ్, సగ్గు శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు వేముల శంకర్ గౌడ్, గర్జకుంట నర్సింహ్మ, కట్కూరి నర్సింగ్ రావు, మందుల మహేందర్, గడ్డం శ్రీను, తదితరులు పాల్గొన్నారు.