Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల కృషి కీలకమని ప్రధానోపాధ్యాయులు రవికుమార్ అన్నారు. ఘట్కేసర్ మండలం ప్రతాప్ సింగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం పదవ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలంటే ఇప్పటి నుండే ప్రత్యేక తరగతులు నిర్వహించాల్సిన అవసరం ఉందని, దానికి తల్లి దండ్రుల కృషి చాలా అవసరమని అన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లు, టీవీలు చూడకుండా, విద్యార్థులను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించాలని కోరారు. సమిష్టి కృషితోనే విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దవచ్చునని తెలిపారు. కార్యమ్రంలో పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మెన్ గ్యార రాజేశ్వర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.