Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
కాలేజ్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఆంధ్ర మహిళా సభ స్వర్ణోత్సవాల్లో భాగంగా గురువారం 'నూతన విద్యా విధానం 2020లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు విద్య' అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ప్రత్యేక విద్యలో ముఖ్యమైన మూడు విషయాల గురించి రిటైర్డ్ ఎమిరిటస్( గౌరవ సూచక) ప్రొఫెసర్ కేఎస్.సుధీర్ రెడ్డి ప్రత్యేకంగా ప్రసంగించారు. వాటిలో 1.ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వైకల్యం రాకుండా చూసుకోవడం, 2. వారికి పునరావాసాన్ని కలగజేయడం 3. వారిని అందరితో సమానంగా చూడటం అనే మూడు అంశాలు చాలా ముఖ్యమైనవిగా చెప్పారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులను సహిత విద్యా విధానంలో పంపుట అనగా వారి పట్ల మన వైఖరిని మార్చుకోవాలని, వారిని అందరితో సమానంగా చూడాలని సూచించారు. కళాశాల చైర్పర్సన్ ప్రొఫెసర్ ఎం. సులోచన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల గురించి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు సదభిప్రాయంతో ఉండాలని తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బందం, విద్యార్థులు పాల్గొన్నారు.