Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్నగర్
ఆర్కేపురం డివిజన్ చిత్రా లే అవుట్లోని అనాథ విద్యార్థి గహ విద్యార్థులకు సింగపూర్ నుంచి విఠల్ ఆనంద్ రూ.1.60 లక్షల విలువైన ఆధునిక సౌండ్ సిస్టంకు సంబంధించి పూర్తి మెషినరీ, పరికరాలను అందజేశారు. అనాథ విద్యార్థి గహంలో ఒక చక్కటి ఆడిటోరియం నిర్మాణం జరిగిందని, దీని ద్వారా విద్యార్థులకు రకరకాల సెమినార్లు, అవసరమైన సౌండ్ సిస్టం లేదని తెలిసి రూ.1.60 లక్షలతో అహుజా కంపెనీకి చెందిన రెండు లేటెస్ట్ వూఫెర్స్, ఆంప్లిఫైర్, 6 స్పీకర్స్ , 2 వైర్లెస్ మౌత్ పీసులు, పోడియం స్పీకర్లు కొని విరాళం ఇచ్చానని తెలిపారు. అనాథ విద్యార్థుల సౌండ్ సిస్టమ్ కోసం రూ. 1.60 లక్షలు విరాళమిచిన విఠల్ ఆనంద్కి గహ అధ్యక్షులు మార్గం రాజేష్ కతజ్ఞతలు తెలిపారు.