Authorization
Sat March 22, 2025 03:49:22 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
ప్రతి చోట ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి వాటిని అభివృద్ది చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ 13వ వార్డు పరిధిలోని అన్నానగర్‌లో స్థానిక కౌన్సిలర్ సామల శ్రీలతబుచ్చిరెడ్డి ఆద్వర్యంలో దాదాపు 25లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, పట్టన ప్రకృతి వనంను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, మున్సిపల్ చైర్మెన్ బోయపల్లి కొండల్ రెడ్డితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్కులో మొక్కను నాటి అనంతరం మాట్లాడుతూ విశాలమైన పార్కు స్థలంలో పట్టన ప్రకృతి వనం, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం ప్రజలకు ఆహ్లాదకరైన వాతావరణం కల్పించడం బాగుందని అభినందించారు. మున్సిపాలిటీలో అవకాశం ఉన్న ప్రతి చోట పార్కులను అభివృద్ధి చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్మెన్ నానావత్ రెడ్యా నాయక్, కమిషనర్ సురేష్, ఏఈ నరేష్ కుమార్, కౌన్సిలర్లు మెట్టు బాల్‌రెడ్డి, బెజ్జంకి హరిప్రసాద్ రావు, నాయకులు బద్దం జగన్ మోహన్ రెడ్డి, ఆకిటి బాల్‌రెడ్డి, బోయపల్లి సత్తి రెడ్డి, సామల బుచ్చిరెడ్డి, బోయపల్లి రాజేశ్వర్ రెడ్డి, అన్నానగర్ కాలనీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్
తెలంగాణలో అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్సిలర్ చింతల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎల్ఐజీ కాలనీ, శ్రీ లక్ష్మీ నర్సింహ్మ కాలనీకి చెందిన దాదాపు 20 మందిని స్థానిక కౌన్సిలర్ నివాసంలో మున్సిపాలిటీ చైర్మెన్ బోయపల్లి కొండల్ రెడ్డితో కలిసి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి పక్షాలకు ఎన్ని చెప్పి ప్రజలు మాత్రం టీఆర్ఎస్ వైపునే ఉన్నారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మందడి సురేందర్ రెడ్డి, వైస్ చైర్మెన్ నానావత్ రెడ్యానాయక్, కౌన్సిలర్లు మెట్టు బాల్‌రెడ్డి, బెజ్జంకి హరిప్రసాద్ రావు, కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ అక్రమ్ ఆలీ, దాసరి శంకర్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శేఖర్, నాయకులు బోయపల్లి సత్తిరెడ్డి, బోయపల్లి రాజేశ్వర్ రెడ్డి, బద్దం జగన్ మోహన్ రెడ్డి, ఆకిటి బాల్‌రెడ్డి, ఎల్ఐజీ కాలనీ నాయకులు సీతారం నాయక్, అర్జున్ యాదవ్, పురుషోత్తం రెడ్డి, సురేష్, రత్నాకర్, జబీనా, సుల్తానా, అంజయ్య, లోకేష్, పద్మ, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.