Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి చామకూర మల్లారెడ్డి
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
మున్సిపాలిటీలు నేడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో దాదాపు రూ. కోటి 17 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను గురువారం మున్సిపల్ చైర్మెన్ బోయపల్లి కొండల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎప్పుడు జరగని అభివృద్ధి ఈఏడేండ్లలో ఎంతో జరిగిందని అన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మెన్ నానావత్ రెడ్యా నాయక్, కమిషనర్ సురేష్, ఏఈ నరేష్ కుమార్, కౌన్సిలర్లు గొంగళ్ల మహేష్, నర్రి ధనలక్ష్మి, చింతల రాజశేఖర్, మెట్టు బాల్రెడ్డి, బెజ్జంకి హరిప్రసాద్ రావు, సామల శ్రీలత, అబ్బవతి సరిత, కో ఆప్షన్ సభ్యులు అక్రమ్ ఆలీ, దాసరి శంకర్, టీఆర్ఎస్ అధ్యక్షుడు మందడి సురేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శేఖర్, బోయపల్లి సత్తిరెడ్డి, బద్దం జగన్ మోహన్ రెడ్డి, మోటుపల్లి శ్రీనివాస్, బోయపల్లి రాజేశ్వర్ రెడ్డి, సామల బుచ్చిరెడ్డి, అబ్బవతి నర్సింహ్మ, జితేందర్ నాయక్, రాఘవేందర్ రెడ్డి, తిలక్, కే.ఎం.రెడ్డి, వినరు, మురళీ తదితరులు పాల్గొన్నారు.