Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్బీనగర్
లింగోజీగూడ డివిజన్ సరూర్ నగర్ ప్రధాన రహదారి ప్రక్కన నూతనంగా నెలకొల్పిన శ్రీసాయికృప ఫర్నిచర్ వరల్డ్ షోరూమ్‌ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. నాణ్యతమైన ఫర్నిచర్‌తో అన్ని రకాల మంచాలు, పరుపులు, టేబుల్స్, సోఫా సెట్స్ తదితర వస్తువులు అందుబాటు ధరలో ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, దయానంద్ గుప్తా, టూరిజం శాఖ చైర్మెన్ శ్రీనివాస్ గుప్తా, పీఠాధిపతి భారతినంద స్వామి, షోరూమ్ నిర్వాహకులు సుంకోజు కృష్ణమాచారి, ఎల్బీనగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి ముద్దగోని రామ్మోహన్ గౌడ్, మిద్దెల.జితేందర్, స్థానిక కార్పొరేటర్లు దర్పల్లి. రాజశేఖర్ రెడ్డి, ఆకుల శ్రీవాణి, మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన.శ్రీనివాసరావు, భవాని.ప్రవీణ్ కుమార్, గజ్జల.మధుసూదన్ రెడ్డి, సత్యంచారి, తిలక్, చీర.శ్రీనివాస్, వివిధ పార్టీల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.