Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
ఒమిక్రాన్ వేరియంట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోని ఆరోగ్యంగా ఉండాలని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మరెడ్డి అన్నారు. ఈమేరకు గురువారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. ఒమిక్రాన్ వేరియంట్ పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యుల అభిప్రాయం తీసుకున్నామని చెప్పారు. కరోనా మొదటి డోసు, రెండవ డోసు తీసుకోని వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఇప్పటికే 85 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేసినందుకు అధికారులను అభినందించారు. అంతకుముందు తమిళనాడులో జరిగిన దుర్ఘటనలో అశువులు బాసిన త్రివిధ దళపతి బిపిన్ రావత్‌తో పాటు వీరమరణం పొందిన సైనికులకు ఒక నిమిషం పాటు మౌనం పాటించి నివాళి అర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కమిషనర్ కృష్ణ మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.