Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
నగరంలో కొలువుదీరిన ఉన్న ఎగ్జిబిషన్లతో చేనేత కార్మికులకు ప్రోత్సాహం లభిస్తుందని ప్రముఖ సోషల్లైట్ శైలజ రెడ్డి అన్నారు. గురువారం సత్యసాయి నిగమాగమంలో కొలువుదీరిన ఇండియా సిల్క్ గ్యాలరీ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత ఉత్పత్తిదారులు ప్రదర్శించిన వస్త్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అని అన్నారు. ఉపాధ్యాయ ఆధునిక మేళవింపుతో రూపొందించిన నూతన డిజైన్లను ఇక్కడ అందుబాటులో ఉంచినట్టు చెప్పారు. కరోనా కారణంగా దెబ్బతిన్న చేనేత రంగాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏప్రిల్‌లో నిర్వహించనున్న శ్రీమతి సిల్క్-2022 పోటీల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నిర్వాహకులు శ్రీనివాస్, ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు.