Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
మాన ప్రాణాలకు భరోసా కల్పించేవే మానవ హక్కులు అని హ్యూమన్ రైట్స్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు అన్నారు. వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే సందర్భంగాహైదరాబాద్, రంగారెడ్డి జిల్లా హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలలో చిన్న పిల్లలకు మాస్కులు, శానిటైజర్లు, అరటిపండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడారు. ప్రతి మనిషి బాధ్యతతో స్వేచ్ఛగా జీవించేందుకు, మానవుల మాన ప్రాణాలకు భరోసా కల్పించేవే మానవ హక్కులు అని తెలిపారు. స్త్రీల హక్కులకు భంగం కలిగించే సంఘటనలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వారి రక్షణకు నిర్భయ లాంటి చట్టాలు తీసుకు వచ్చారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జంగారెడ్డి, జిల్లా జోనల్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, కందుకూరు మండల్ యూత్ వింగ్ ప్రెసిడెంట్ దినేష్ తదితరులు పాల్గొన్నారు.