Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఆర్ట్స్ కాలేజీకి పార్కింగ్ స్థలానికి ఏర్పాటు చేయాలని, మొదటి సంవత్సరం పీజీ విద్యార్థుల వసతిగహాలు వెంటనే ప్రారంభించాలని శుక్రవారం ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గణేష్ కు వినతి పత్రం అందజేశారు. పరిశోధక విద్యార్థుల మెస్, ఆర్ట్స్ కాలేజీ లైబ్రరీలో అన్ని డిపార్ట్మెంట్స్ నూతన పుస్తకాల ఏర్పాటు, వసతులను మెరుగుపరచాలని, అమ్మాయిల హాస్టల్లో పరిశుభ్రంగా వాష్ రూమ్, వైద్య సదుపాయాలు, కాలేజీలో వాటర్ ప్యూరిఫై క్లీన్ చేయాలని, ఆర్ట్స్ కాలేజీకి ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, ఎస్ఎఫ్ఐ ఓయు కార్యదర్శి రవి నాయక్ నాయకులు ఆంజనేయులు, శ్రీనివాస్, రమ్య, రాజేష్, సుమలత, మమత తదితరులు పాల్గొన్నారు.