Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూలో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని శుక్రవారం బహుజన విద్యార్థి సంఘాల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఓయూ వీసీ ప్రొ.రవీందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఎన్నో సంవత్సరాలుగా భర్తీకి నోచుకోకుండా ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో బహుజన విద్యార్థిసంఘాల నేతలు వేల్పుల సంజరు, బహుజన్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి తిరుపతి, ఓయూ జాక్ చైర్మెన్ పులింగంటి వేణుగోపాల్, ఉప అధ్యక్షుడు అంజి, గౌడ సంఘం రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.