Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్‌మెట్/ధూల్‌పేట్
దేశ రక్షణకు బిపిన్ రావత్ చేసిన సేవలు వెలకట్టలేనివి అని తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ వైస్ చైర్మెత్ మాడపు వీర మల్లేష్ అన్నారు. శుక్రవారం ట్యాంక్‌బండ్‌పై ఉన్న బసవేశ్వర విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి బిపిన్ రావత్‌కు నివాళి అర్పించారు. కార్యక్రమంలో తెలంగాణ వీరశైవ లింగాయత్ ఫెడరేషన్ యువత అధ్యక్షులు ఆలూరు ఈశ్వర్ ప్రసాద్, కోట గుండప్ప, మల్లికార్జున్, చిందీ బద్రీనాథ్, వీరమణి, మట్టిక గౌరి శంకర్, బేతాళ శ్రీనివాస్, కొట్టిడీ వీరేందర్, శివ కుమార్, వీరేశం పాల్గొన్నారు.
గౌలిపురా గాంధీ బొమ్మ వద్ద
యువజన కాంగ్రెస్ నాయకులు ఎస్.పి.క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో గౌలిపురా గాంధీ బొమ్మ వద్ద బిపిన్ రావత్ చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వొత్తులు వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ సందర్భంగా ఎస్.పి.క్రాంతి కుమార్ మాట్లాడుతూ భారత ఆర్మీ చీఫ్, త్రివిధ దళాలకు అధిపతి బిపిన్ రావత్ ఆయన సతీమణి మధులిక, ఇతర ఆర్మీ ఉన్నతాధికారులు హెలికాప్టర్ కూలిపోయిన దుర్ఘటనలో మరణించడం అత్యంత బాధాకరమైన విషయం అని అన్నారు. కార్యక్రమంలో పీసీసీ యాకుత్‌పురా అసెంబ్లీ కోఆర్డినేటర్ బండారి లత, పీసీసీ కార్యదర్శులు ఎం.కృష్ణ కుమార్, అల్లం భాస్కర్, నాయకులు పి.రాజు యాదవ్, జి.సుభాష్, ముత్యం యాదవ్, ఆర్.శివ కుమార్, కె.వినరు, ఏ.రాకేష్, శ్రీనివాస్, బి.వెంకటేష్, ప్రణీత్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.