Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని నాగారం మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్ గూడూరు సబితా ఆంజనేయులు గౌడ్ అన్నారు. శుక్రవారం ఏడో వార్డులో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమంలో భాగంగా తడి పొడి చెత్త గురించి అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కానీల్లో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని సూచించారు. నాగారంను స్వచ్ఛ మున్సిపాల్టీగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు మధు గౌడ్, కాలనీ వాసులు, సర్వేక్షన్ ఇన్చార్జి వెంకట్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.