Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి సర్కిల్ ఆనంద్‌బాగ్ చౌరస్తాలోని బందావన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం కోలా మహేష్ యాదవ్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప 18వ మహా పడిపూజ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ 18వ మహా పడిపూజ కార్యక్రమానికి గురుస్వామి ఆత్రేయ ఆధ్వర్యంలో పూజలు, జడల రమేష్, గంగపుత్ర నర్సింగ్ రావు గాన బృందం ఆలపించిన అయ్య ప్ప భక్తి గీతాలు, భక్తులను ఆకట్టుకున్నాయి. సుమారు రెండు వేల మంది అయ్యప్ప మాల దారులు, భక్తులు, పాల్గొన్నారు. అనంతరం అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వై.ప్రేమ్ కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, పిట్ల శ్రీనివాస్, రాము యాదవ్, బద్ధం పరశురామ్ రెడ్డి, పిట్ల నాగరాజు, సత్యనారాయణ, గురు స్వాములు జ్యోతిర్మయి చారి, బాలకృష్ణ, పిట్ల అశోక్, తదితరులు పాల్గొన్నారు.