Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
నేరెడ్మెట్ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా స్థానిక డివిజన్ కార్పొరేట్ మీనా ఉపేందర్ రెడ్డి డివిజన్లోని డిఫెన్స్ కాలనీలో ఉన్న పార్టీ ఆఫీసులో కేక్ కట్ చేసి సంబురాలు జరు పుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ తనకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, మల్కాజిగిరి ఎమ్యెల్యే మైనంపల్లి హనుమంతరావుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏడాది కాలంగా నేరెడ్మెట్ డివిజన్‌ను చాలా రకాలుగా అభివృద్ధి చేశామనీ, రాబోయే రోజుల్లోనూ మరింత అభి వృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మహిళ నేతలు, పార్టీ సభ్యులు, మల్కాజిగిరి చికెన్ షాపుల సంఘం సభ్యులు పాల్గొని కార్పొరేటర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.