Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకో వాలని వసంతపురి కాలనీ అధ్యక్షులు బ్రహ్మయ్య చౌదరి అన్నారు. స్థానిక కార్పొరేటర్ వై.ప్రేమ్ కుమార్ సహకా రంతో శుక్రవారం ఆనంద్‌బాగ్ డివిజన్ పరిధిలోని వసంత పురి కాలనీ కమ్యూనిటీ హాల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య చౌదరి మాట్లాడుతూ కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు. ఫస్ట్ డోస్ తీసుకుని గడువు ముగిసిన వెంటనే తప్పని సరిగా రెండో డోస్ తీసుకోవా లని కోరారు. కాలనీలోని ప్రజల నుంచి మంచి స్పందన లభించిందనీ, కాలనీలో అందరికీ అందుబాటులో విధంగా వ్యాక్సిన్ సెంటర్‌ను ఏర్పాటు చేయించిన డివిజన్ కార్పొరే టర్ వై.ప్రేమ్ కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ నెంబర్స్ రాము, శ్యామ్, శివ, స్థానిక కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.